calender_icon.png 15 November, 2024 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో ఎన్నికలు ప్రశాంతం

14-11-2024 01:19:34 AM

తొలి విడతలో ౪౮ స్థానాల్లో పోలింగ్

6౬ శాతం ఓటింగ్ నమోదు దేశంలోని మరో 31 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక

రాంచీ, నవంబర్ 13: జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6౬.౪౮ శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 81 నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో భాగంగా 43 స్థానాలకు ఎన్నిక జరిగింది. ఈ స్థానాల్లో 683 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మాజీ సీఎం చంపయి సోరెన్, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా వంటి కీలక నేతలు బరిలో ఉన్నారు. తొలి విడత కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వంటి ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

వయనాడ్‌లో ఉపఎన్నిక 

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కేరళలోని వయనాడ్‌లో ఎంపీ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.79 శాతం ఓటింగ్ నమోదైంది. వయనాడ్‌లో యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ బరిలో నిలిచారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వయనా డ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది.   

10 రాష్ట్రాల్లోని ఉపఎన్నికలు

దేశంలోని మొత్తం 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా ఎన్డీయే, ఇండియా కూటమికి అగ్నిపరీక్షగా నిలవనున్నాయి. రాజస్థాన్ 7, బెంగాల్ 6, అస్సాం 5, బీహార్ 4, కర్ణాటక 3, మధ్యప్రదేశ్ 2, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కేరళ, మేఘాల యలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. జార్ఖండ్ రెండో విడతలో 38 స్థానాలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని 14 శాసనసభ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు.