26-02-2025 07:41:55 PM
దస్తూరాబాద్ (విజయక్రాంతి): రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అంతా సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలకు బ్యాలేట్ బాక్స్ లతో ఎన్నికల అధికారులు వచ్చారు. ఇందులో జోనల్ అధికారి గణేష్, రూట్ అధికారి జాడి తిరుపతి, ప్రోసిడెంట్ అధికారి దినేష్, ఎస్ఐ శంకర్, ఎఎస్ఐ లక్ష్మీ నారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.