calender_icon.png 14 February, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళి పాటించాలి

14-02-2025 12:00:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్లగొండ, ఫిబ్రవరి 13 (విజయక్రాం తి) : ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల  ప్రవర్త నా నియమావళిని తప్పనిసరిగా పాటించా లని నల్లగొండ కలెక్టర్ వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గురువారం ఆమె బరిలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లతో కలెక్టరెట్లోని సమావేశం నిర్వహించారు.

అభ్యర్థులు పాఠశాల సమ యాల్లో ప్రచారం చేయడం నిషిద్ధమని, అనుమతుల కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం పరిధిలో ఉండే ఆయా జిల్లా ఎన్నికల అధికారులు, సహా య రిటర్నింగ్ అధికారులతో అనుమతులు తీసుకోవచ్చని తెలిపారు. మొత్తం నియోజ కవర్గానికి సంబంధించిన  అనుమతులను నల్గొండ ఆర్‌ఓ ద్వారా తీసుకోవచ్చని చెప్పారు.

ముఖ్యంగా వాహనాలు, ర్యాలీల కు సంబంధించిన అనుమతులు ఆయా జిల్లాలలో తీసుకోవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ ఏజెంట్ల నియామకం, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు వెంటనే సమర్పించాలని, గుర్తింపు కార్డుల కు ఫోటోలను వెంటనే ఇవ్వాలని అన్నారు.