15-03-2025 12:28:38 AM
మునగాల, మార్చి 14 : సూర్యాపేట జిల్లా మునగాల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకుఇచ్చిన హామీలను అమలు చేసి, పేదలను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మండల పరిధిలో కలకోవ గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలు అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎండిన వరి పంట పొలాలు రైతులతో కలసి పరిశీలన చేశారు. ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చిఆదుకోవాలని సూచించారు రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు యుద్ధప్రాతిపదికన మండల వ్యాప్తంగా అన్ని గ్రా మాలలో పర్యటించి పంట నష్టాన్నిఅంచనావేయాలన్నారు.లేనియెడల అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు