ఓటమి చెందిన రాజకీయ ప్రత్యర్థి ప్రోద్బలంతోనే తన ఎన్నికల అఫిడవిట్ పై పిటిషన్
కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఓటమి చెందిన రాజకీయ ప్రత్యర్థులంతోనే తనపై ఎన్నికల పిటిషన్ దాఖలు అయిందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) తెలిపారు. బుధవారం రాత్రి ఆయన విడుదల చేసిన పోరాటంలో ఆఫీడవిట్లో తప్పులు ఉన్నాయనే ఆరోపణల్లో ప్రాధమిక ఆధారాలు లేవన్నారు. గౌరవ న్యాయస్థానంపై సంపూర్ణ విశ్వాసం ఉందని, అఫిడవిట్ పిటిషన్ విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. మరే అంశం ఇందులో లేదనీ, హైకోర్టులో న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన అఫిడవిట్ పై వేసిన పిటిషన్ వీగిపోతుందన్నారు. ప్రజాలతీర్పుకు భిన్నంగా దొడ్డిదారిన అందలం ఎక్కాలనుకోవడం అవివేకమని విమర్శించారు. అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందొద్దన్నారు. ఐదేళ్ల తన పదవికి ఎలాంటి డోకా లేదని స్పష్టం చేశారు.