calender_icon.png 27 December, 2024 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

02-12-2024 05:26:31 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): అన్ని ఉపాధ్యాయ సంఘాలకు మాతృ సంఘంగా గుర్తింపు పొందిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ .టి. యు, టి .ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. కొత్తగూడెంలోని శేషగిరి భవనంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి. మంగీలాల్ (సుజాత నగర్ మండలం), ప్రధాన కార్యదర్శిగా ఎండీ. లాల్ అహ్మద్ (పాల్వంచ మండలం)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా బి.చందర్ (లక్ష్మీదేవిపల్లి మండలం), గౌరవ సలహాదారుడిగా కే.సుధాకర్ (పాల్వంచ మండలం), అసోసియేట్ అధ్యక్షులుగా ఎం. జ్యోతిరాణి (టేకులపల్లి మండలం), ఏ.మోహన్ (లక్ష్మీదేవిపల్లి మండలం), బి.భోజ్యాలాల్ (చర్ల మండలం), అదనపు ప్రధాన కార్యదర్శులుగా జీ.శంకర్, బీ.గోపాల్ (జులూరుపాడు మండలం), ఉపాధ్యక్షులుగా బి.శ్రీను (జులూరుపాడు మండలం), ఎస్. లక్ష్మయ్య (దమ్మపేట మండలం), బీ.వెంకట్ (జులూరుపాడు మండలం), కార్యదర్శులుగా ఎం.సత్యనారాయణ (దమ్మపేట మండలం), బి.రాజువల్ (బూర్గంపాడు మండలం), మహిళా కార్యదర్శిగా ఐ.దీనమ్మ (పాల్వంచ మండలం), కోశాధికారిగా బి. సుబ్బారావు (కొత్తగూడెం మండలం) లు ఎన్నికయ్యారు. 

జిల్లా కౌన్సిల్ లో చేసిన తీర్మానాలు నూతన పీఆర్సీని తక్షణమే ప్రకటించి, గత పీఆర్సీ ఎరియర్స్ ను ఒకే సారి చెల్లించాలి. పెండింగ్ D.A లను తక్షణం విడుదల చేయాలి. GPF ను,TSGLIC లను ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలి. ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో ఉత్పన్నమయ్యే ఖాళీలను సీనియార్టీ ప్రకారం పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులతో భర్తీ చేయాలి. రిటైర్ అయిన ఉపాధ్యాయులందరికీ బెనిఫిట్స్ ను తక్షణమే అందజేయాలి. 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులందరి సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలి. స్పెషల్ టీచర్ లకు (398 రూపాయల వేతనంతో పనిచేసిన) అందరికీ నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. బోధన, బోధ నేతర పనుల్లో ప్రస్తుతం పని భారం విపరీతంగా పెరిగినందున ఉపాధ్యాయులపై ఎలాంటి కక్ష్య సాధింపు చర్యలు లేకుండా చూడాలి. SGT లకు MLC ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో SSC స్పాట్ వాల్యుషన్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలి. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వం ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం రెమ్యునరేషన్ ను వెంటనే చెల్లించాలి.