calender_icon.png 10 March, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివేకానంద కాలనీ సంఘం కార్యవర్గం ఎన్నిక

09-03-2025 08:22:57 PM

ప్రజాప్రతినిధులను కలిసిన కమిటీ సభ్యులు...

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద కాలనీలో  కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఇటీవల ఎన్నుకున్నారు. ఈ మేరకు కమిటీ కార్యవర్గం సభ్యులు ఆదివారం ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులను కలిసి తమకు సహకరించాలని కోరారు. కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కాలనీలో సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... త్వరలోనే కాలనీలోని ప్రతి సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపడతామన్నారు.

అనంతరం బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగమణి, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ కృష్ణ, జాయింట్ సెక్రెటరీ విక్రమ్, ట్రెజరర్ శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు మధు, సూర్య నారాయణ, మోహన్ రావు కసిమ్, వెంగయ్య, కన్నాన్, వెంకట దాస్, సతీష్, రామారావు, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.