calender_icon.png 22 January, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా శివప్రసాద్ ఎన్నిక

21-01-2025 05:45:32 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు పోటాపోటీగా ఆదివారం జరగగా, సోమవారం రాత్రి ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నకలను మరిపించే విధంగా కొనసాగాయి. బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షునిగా కందుకూరి శివప్రసాద్, పోలోజు సత్యనారాయణ పోటీ పాడగా, 102 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా గుంటుపల్లి అప్పారావు 81 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా పొన్నోజు ప్రేమాచారి 109 ఓట్ల మెజారిటీతో గెలవగా, సంయుక్త కార్యదర్శిగా రాచమళ్ళ వేమన చారి 91 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, కోశాధికారిగా కాగితపు నవీన్ కుమార్ 114 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సంఘ సభ్యులందరికి శివప్రసాద్ టీమ్ కృతజ్ఞతలు తెలిపారు.