calender_icon.png 14 November, 2024 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు

13-11-2024 01:49:19 AM

ఎన్నికల అధికారిగా ఎన్ శంకర్

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2024 నుంచి 2027 వరకు మూడేళ్ల పదవీ కాలానికి ఈ ఎన్నికలు జరుగనున్నాయని ఎన్నికల అధికారి ఎన్ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 13న నామినేషన్, గురువారం నామినేషన్ విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ ఉంటుందని వెల్లడిం చారు.

18న ఎన్నికలు నిర్వహించనున్నామని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ సంఘంలో తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.