calender_icon.png 19 March, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశాలి సంఘం అడహాక్ కమిటీ ఎన్నిక

17-03-2025 02:04:29 AM

మందమర్రి మార్చి 16 : పట్టణంలోని మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం అడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మార్కెట్లోని పద్మశాలి భవనంలో ఆదివారం నిర్వహించిన సర్వసభ్య  సమావేశంలో అడహక్ కమిటీని ఎన్నుకున్నారు. ఇదివరకు అధ్యక్షునిగా పనిచేసిన బత్తుల శ్రీనివాస్ ప్యానెల్ పదవి కాలం పూర్తి కావడంతో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు పాత కమిటీని రద్దు చేశారు.

నూతన కమిటీ ఎన్నికలు జరిగే వరకు సంఘం బాధ్యతలు నిర్వర్తిం చేందుకు ఓ రాజశేఖర్, పుట్ట సదానందం, పిట్టల సుధాకర్, లక్షేట్టి రమేష్, గొనే  శ్రీనివాస్ లను ఆడహక్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

ఈ సందర్బంగా అడహక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అడహక్ కమిటీ ఆధ్వర్యంలో  కులబాందవుల సభ్యత్వం నమోదుతో పాటు, కమిటీ ఎన్నికల నిర్వహణ అడహక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

పద్మశాలి కుటుంబ సభ్యులు వారి సమస్యల పరిష్కారం కోసం అడహక్ కమిటీ సభ్యులను సంప్రదించాలని సూచించారు. పట్టణ కమిటీ ఎన్నికలు జరిగే వరకు కులస్తులు అడహక్ కమిటీకి సహకరించి ప్రశాంత వాతా వరణంలో ఎన్నికలు నిర్వహించేలా తోడ్పాటు నందించాలని వారు కోరారు.