calender_icon.png 10 January, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో ఎఫ్‌వో నూతన కమిటీ ఎన్నిక

01-01-2025 12:45:34 AM

హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): తెలంగాణ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ టీజీవో ఫోరమ్ నూతన కమిటీ ఎన్నికైనట్టు టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. కమిటీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా టీజీవో ఉపాధ్యక్షుడు ఎం రామకృష్ణగౌడ్ వ్యవహరించినట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ  ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ టీజీవో ఫోరమ్ అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస్, సెక్రటరీగా బీ ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా జీ శ్రీధర్‌రావు, ఉపాధ్యాక్షుడిగా కే అరుణ్, జాయింట్ సెక్రటరీలుగా సీహెచ్ శ్రీనివాసులు, ఆర్ మీనా కుమారిలతోపాటు మొత్తం పదకొండు మందితో నూతన కమిటీ ఎన్నికైనట్టుఎన్నికైనట్టు వెల్లడించారు.