calender_icon.png 11 February, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నూతన కార్యవర్గము ఎన్నిక

10-02-2025 07:30:10 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయం 2025-2028 సంవత్సరాలకు నూతన పాలకమండలి ఎంపిక సోమవారం నాడు హాజరైన సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలో అధ్యక్షులుగా కొమ్మనాపల్లి ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులు, ముఖ్య సలహాదారు కురిచేటి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులుగా తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులు-1 గా మాగంటి శ్రీనివాస వరప్రసాద్, ఉపాధ్యక్షులు-2 గా కొమ్మనాపల్లి వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా అబ్బినేని శ్రీనివాసరావు సహాయ కార్యదర్శిగా వ్మందరపు లక్ష్మీ నాగరాజు కోశాధికారిగా గొర్ల వెంకటేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సభ్యులు గంజి రామ్మోహన్రావు (చిట్టిబాబు) పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ మాట్లాడుతూ... ఎన్నికైన సభ్యులందరూ త్వరలో ప్రమాణ స్వీకారోత్సవం చేసి విధులలో పాల్గొని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు.