హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో శుక్రవారం జరిగిన సమావేశంలో నిమ్స్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా ఎం.హరినాథ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.శరత్‌బాబు, కోశాధికారిగా రామరాజు, ఉపాధ్యక్షులుగా వేణుగోపాల స్వామి, పూలమ్మ, జాయింట్ సెక్రటరీగా నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు.. నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణను కలిసి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.