calender_icon.png 20 April, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎంఎస్ అనుబంధ పోస్టల్ యూనియన్ల నూతన కార్యవర్గం ఎన్నిక

14-04-2025 12:52:20 AM

మనకొండూర్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గ్రూప్ సి, పోస్ట్మాన్ ,  ఎమ్.టి.ఎస్ విభాగాలకు సంబంధించిన భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ యూనియన్ల నూతన కార్యవర్గాన్ని కరీంనగర్ ప్రధాన పోస్టాఫీస్ లో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు.

భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి డివిజన్ అధ్యక్షునిగా పంగ అంజయ్య, ఉపాధ్యక్షునిగా బైరి ప్రదీప్, కార్యనిర్వాహక అధ్యక్షునిగా సకినాల అనిల్కుమార్, కార్యదర్శిగా నాగుల ఆంజనేయులు, సహాయ కార్యదర్శులుగా  పి రమేష్, రాజమల్లు , సంఘటన కార్యదర్శిగా జంపాల సాయిక్రిష్ణ లను, భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోస్ట్ మాన్,  ఎమ్ టి ఎస్ కరీంనగర్ డివిజన్ అధ్యక్షునిగా దాడి మల్లేశం, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మిట్టపల్లి సదయ్య, కార్యదర్శిగా ఓరుగంటి విష్ణువర్ధన్, సహాయ కార్యదర్శిగా చౌహన్ లఖన్, కోశాధికారిగా రేగుల రాజ్ కుమార్ లని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్, జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, పోస్టల్ సూపర్వైజర్ అసోసియేషన్ ఆర్‌ఆర్ కార్యదర్శి కె.వి. పవన్కుమార్,  తదితరులు తెలిపారు.