మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయుటీఎస్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా నూతన అధ్యక్షుడిగా భట్టారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా బాపు, మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కరుణాకర్, అసోసియేట్ అధ్యక్షుడిగా సత్తయ్య, వైస్ ప్రెసిడెంట్ లుగా పద్మ, మన్మోహన్, మహాలక్ష్మి, అదనపు ప్రధానకార్యదర్శిగా సుమన్, జిల్లా కార్యదర్శులుగా జయ, శ్రీరామ్, మాధవి, స్వప్నదేవి, ఆర్థిక కార్యదర్శిగా సత్యనారాయణ, ఫైనాన్స్ కమిటీ సభ్యులుగా గంగుతాయి, సుజాతలు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి రామ్ సుబ్బారావు, పోల్ రెడ్డిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయుటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పార్వతి రెడ్డి, మంచిర్యాల జిల్లా పూర్వ అధ్యక్షుడు పోకల వెంకటేశ్వర్లు, పూర్వ ప్రధాన కార్యదర్శి బీసగౌని శంకర్ గౌడ్, పూర్వ గౌరవ అధ్యక్షుడు భీం రావ్, మంచిర్యాల మండల అధ్యక్షుడు మల్లేష్ తో పాటు వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.