calender_icon.png 4 December, 2024 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీవో నూతన కమిటీ ఎన్నిక

03-12-2024 11:20:45 PM

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కామారెడ్డి జిల్లా శాఖ నూతన కమిటీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షునిగా దేవేందర్ అసోసియేట్ అధ్యక్షుడిగా సుభాష్ ఉపాధ్యక్షులుగా నీలం లింగం, సంతోష్ ని రెడ్డి, కార్యదర్శిగా సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమేష్, నర్సింలు, జ్యోతి, కోశాధికారిగా భూమయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నిజాం, పబ్లిసిటీ సెక్రటరీగా ప్రశాంత్ రెడ్డి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సెక్రటరీగా సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తౌరాబుద్ధి, ఠాగూర్, శశికిరణ్, సవిత రెడ్డి ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి టీఎన్జీవో కామారెడ్డి జిల్లా శాఖ తరపున పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.