08-04-2025 07:56:06 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక న్యాయస్థానంలో సోమవారం రాత్రి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా కొమిరెడ్డి సత్తన్న, ప్రధాన కార్యదర్శి గా ఎస్ ప్రదీప్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా నళిని కాంత్, జాయింట్ సెక్రటరీగా ఎన్ సత్యగౌడ్, లైబ్రరీ సెక్రటరీగా షఫీక్, ట్రెజరర్ గా సుమన్ చక్రవర్తి, క్రీడలు & సాంస్కృతిక సభ్యులుగా బి సంతోష్, లేడీ రిప్రజెంటేటివ్ గా జి.పద్మ, కార్యనిర్వాహక సభ్యులుగా రెడ్డిమల్ల ప్రకాశం, రహమతుల్ల, సదాశివ్, లను ఎన్నుకున్నారు. ఎలక్షన్ అధికారులుగా గోవిందరావు, పాల్సన్ లు వ్యవహరించారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన వారిని సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.