calender_icon.png 3 October, 2024 | 2:47 PM

లయన్స్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

03-10-2024 01:31:54 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ నూతన కార్యవర్గాన్ని తాజాగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా లయన్ గుంజా వెంకట్రావు, సెక్రటరీగా జాజుల అంజయ్య, కోశాధికారిగా బిక్షపతిని ఎన్నుకున్నారు. హెలెన్ కెల్లర్ కళాశాల ఆవరణలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్థానిక హెలెన్ కెల్లర్ సంస్థ చైర్మన్ లయన్ పటాన్ చేతులమీదుగా బుధవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సురేష్ జిజ్ఞాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లయన్ మోహన్ దాస్ లయన్ క్లబ్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ముగం, ఎం శశిధర్‌రెడ్డి, రాజేంద్రకుమార్, పీ ఉమాశంకర్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.