calender_icon.png 25 November, 2024 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక ఆపలేం

27-10-2024 02:14:26 AM

అసోసియేషన్‌కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ కబడ్డీ అసోసి యేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్‌తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర వివరాల తో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.

తెలంగాణ కబడ్డీ సంఘం కార్యవర్గానికి ఈ నెల 7న ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు బసాని హేమంత్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక విచార ణ చేపట్టారు. అసోసియేషన్ ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చారు.

ఎన్నికలు అక్ర మ మార్గంలో జరిగాయని తేలితే ఫలితాలు వెలువడిన తర్వాతనైనా రద్దు చేస్తామని తెలిపారు. ఎన్నికల ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లను చేర్చార ని, జాతీయ క్రీడాభివృద్ధి కోడ్  2011, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడం లేదని పిటిషనర్ వాదన. ఎన్నికలు పారదర్శకంగా, చట్టప్రకారం నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆదివారం తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి.