యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): యూనివర్సల్ తోగట సంగం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి లో జరిగిన ఎన్నికల బరిలో డాక్టర్ చిన్న బత్తిని బాలరాజు తన సమీప అభ్యర్థి పసల శౌరి మీద 286 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల కమిటీ సభ్యులు అధికారికంగా గెలుపు నియామక పత్రమును అందించినారు. గెలుపొందిన డాక్టర్ చిన్నబత్తిని బాలరాజు రాష్ట్ర అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు పదవిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తొగట సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ... రాబోయే మూడు సంవత్సరాలు తొగడ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తన సభ్యులతో కలిసి నెరవేరుస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.