calender_icon.png 27 December, 2024 | 7:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రి డాక్టర్స్ కార్యవర్గం ఎన్నిక

04-12-2024 04:48:08 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఏడిఏ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు సల్మాన్ నాయక్ జనరల్ సెక్రెటరీ తిరుపతి నాయక్ సభ్యుడు అనిల్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్ గా ఆర్. శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడిగా మిలంద్ కుమార్, సెక్రెటరీగా యుగేందర్, జాయింట్ సెక్రెటరీగా నాగరాజు, ట్రెజరర్ గా మంజుల, వైస్ ప్రెసిడెంట్ గా హేమలత, రాష్ట్ర ఏసీ సభ్యులుగా గోపికాంత్, గిరీష్ లు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారిని పలువురు అభినందించారు.