calender_icon.png 27 December, 2024 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ చేతిలో ఎన్నికల సంఘం

27-12-2024 01:28:12 AM

ఎలక్షన్లపై విశ్వాసం సన్నగిల్లుతోంది

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

2025 రోడ్‌మ్యాప్‌పై చర్చ

బెళగావిలో సీడబ్ల్యూసీ భేటీ

బెళగావి, డిసెంబర్ 26: ఎన్నికల సం ఘం వంటి రాజ్యాంగ సంస్థలను తన గుప్పి ట్లో పెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంద ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై ప్రజ ల్లో విశ్వాసం క్రమంగా సన్నగి ల్లుతోందని అన్నారు.కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సమావేశా లు వందేళ్ల క్రితం బెళగావిలోనే జరిగాయి.

ఈ నేపథ్యంలో ‘నవ సత్యాగ్రహ బైఠక్’ పేరు తో సీడబ్ల్యూసీ సమావేశాలను రెండు రోజులపాటు(26,27 తేదీల్లో) ఇక్కడ నిర్వహిస్తు న్నారు. పార్టీ జెండా ఎగరవేసి సమావేశాల ను ఖర్గే ప్రారంభించారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్‌గాంధీ, జైరాం రమేశ్, కర్ణాటక సీఎం సిద్ధరామ య్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, భూ పిందర్ హుడా, రాజీవ్ శుక్లా, తెలంగాణ సీ ఎం రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది 2025 రోడ్ మ్యాప్‌నకు కార్యచరణ ప్రణాళికపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది.

ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  మాట్లాడుతూ  నెహ్రూ, గాంధీ, అంబేద్కర్ గౌరవం కోసం చివరి శ్వాస వరకు తామంతా పోరాడతామని ప్రకటించారు. బీజేపీ తీవ్రస్థాయి లో విమర్శలు  చేశారు. బీజేపీ కారణంగా ఈసీ నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల నియమావళిలో మార్పుల ద్వారా కేంద్రం ఏం చేయాలనుకుంటుందని ఆయన ప్రశ్నించారు. 

కొత్త నాయకత్వానికి అవకాశం..

వచ్చే ఏడాదిలో పార్టీలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తామని ఖర్గే ప్రకటించారు. ఎన్నికల్లో నెగ్గేందుకు అవసరమైన నైపుణ్యాలతో పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. ఎన్నిక ల్లో గెలవడానికి కేవలం శ్రమిస్తే సరిపోదని, సమయానుకూలంగా వ్యూహాలు ఉండాలని సూచించారు. ఇందుకోసం ఒక నిర్దిష్ట మార్గం అవసరమన్నారు. పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.

కొత్త సత్యాగ్రహం అవసరం: జైరాం

కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం అబద్దాలు, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని జైరాం రమేశ్ వి మర్శించారు. వారిని ఎదుర్కోవడానికి  కొత్త సత్యాగ్రమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్‌పై కేంద్రహోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో చర్చిస్తామన్నారు. మహాత్మాగాంధీ వారసత్వాన్ని రక్షించడానికి, పరిరక్షించడానికి, ప్రో త్సహించడానికి  కృషి చేస్తామని తెలిపారు.  27న బెళగావిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. 

సమావేశాలకు సోనియా దూరం

అనారోగ్య కారణాలతో బెళగావి సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకాలేదు. అయితే సమావేశాలను ఉద్దే శించి ఆమె  ప్రకటన విడుదల చేశా రు. సోనియా పరిస్థితి మెరుగుపడకపెతే ప్రియాంక గాంధీ కూడా సమా వేశానికి రాకపోవచ్చని సమాచారం.