calender_icon.png 13 March, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టివేత

13-03-2025 01:47:01 AM

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించార ని మాజీ మంత్రి కేటీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై హైదరాబాద్ ముషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును బుధవారం హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా బాణసం చా కాల్చడంతోపాటు ప్రజలకు అసౌక ర్యం కలిగించారంటూ అప్పటి ఎస్సు ఆర్ ప్రేమకుమార్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలంటూ మాజీమంత్రి కేటీఆర్, ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. కేసును కొనసాగించడానికి చట్టపరంగా సరైన ఆధారాలు లేవని, అభియోగాలను నిరూపించడానికి సరైన కారణాలు లేవని కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.