స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని అనేక గ్రామాలలో ఇంకా ‘ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని’ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల తుది లిస్టులూ తయారవాల్సి ఉంది.
మరోవైపు చాలావరకు ఊళ్లలో వీథి దీపాల నుంచి పారిశుద్ధ్యం వరకూ కనీస సౌకర్యాల కొరత కనిపిస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా సమస్యలు తీరాలని ఆశిద్దాం. - సింగు లక్ష్మీనారాయణ, కరీంనగర్