calender_icon.png 3 December, 2024 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రిలో అనాధగాఅవ్వ.. కన్నెత్తి చూడని పిల్లలు

21-11-2024 03:02:44 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పిల్లలను పెంచి పెద్ద చేస్తే వృద్ధాప్యంలో తోడుగా అండగా నిలుస్తారని భావించిన ఓ వృద్ధురాలకు సొంత పిల్లలే ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి పత్తా లేకుండా పోయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లికి చెందిన గీకూరి సాయవ్వకు ఇద్దరు కుమారులు ఒక కూతురు కాగా ఒక కుమారుడు మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో  ఆస్తులన్నీ అమ్ముకొని పదేళ్లుగా కామారెడ్డి లో నివాసం ఉంటున్నారు. సాయవ్వకు కొడుకు వెంకటేష్, కోడలు, కూతురు ఉన్నారు.

ఈనెల 18న సాయవ్వ కిందపడి పోవడంతో చేయి విరిగింది. సాయవ్వ ను ఆమె కూతురు జిల్లా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయింది. నాలుగు రోజులుగా ఆమె కోసం ఆసుపత్రికి ఎవరు రావడం లేదు. కొడుకు కూతురుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. దీంతో ఆస్పత్రి వైద్య సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్ ఆ వృద్ధురాలికి  సేవలందిస్తున్నారు. అందరూ ఉండి అనాధగా ఆ అవ్వ ఇతరుల సేవలను పొందుతుంది. సాయమ్మ కూడా పెట్టిన ఆస్తులను మాత్రం అనుభవిస్తున్న కొడుకు కోడలు కూతురు బాగోగు లను మాత్రం చూడడం లేదు.