calender_icon.png 16 April, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుషాయిగూడలో కిరాతకం.. వృద్ధురాలి హత్య

15-04-2025 09:55:12 AM

హైదరాబాద్: కుషాయిగూడలో(Kushaiguda Police Station) వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ నెల 11న వృద్ధురాలు మృతి చెందగా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణానగర్ లో కమలాదేవి ఒంటరిగా నివాసం ఉంటుంది. కమలాదేవి ఇంటి నుంచి దుర్వాసన గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇంట్లో కుళ్లిన స్థితిలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించారు. రాజస్థాన్(Rajasthan) కు చెందిన వృద్ధురాలు హైదరాబాద్ లో  స్థిరపడింది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కమలాదేవి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కమలా దేవికి చెందిన షాపులో ఓ యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అద్దె అవిషయంలో వృద్ధురాలిపై కోపం పెంచుకున్న యువకుడు ఆమెను చంపి తాళం వేసి పారిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.