calender_icon.png 18 April, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దె అడిగిందని వృద్ధురాలి హత్య

16-04-2025 12:41:31 AM

మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ యువకుడి పైశాచిక ఆనందం 

ఆ వీడియో మిత్రులకు పంపిన యువకుడు

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన 

పోలీసుల అదుపులో ముగ్గురు? 

అందులో ఒకరు మైనర్ 

మేడ్చల్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): మేడ్చల్):మల్కాజిగిరి జిల్లాలోని కుషాయిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అద్దె అడిగినందుకు వృద్ధురాలిని దారుణం గా హత్య చేసి, మృతదేహంపై డ్యాన్స్ చేసి ఓ యువకుడు పైశాచిక ఆనందం పొందా డు. రాజస్థాన్‌కు చెందిన దంపతులు గతం లో కుషాయిగూడలోని హౌసింగ్‌బోర్డ్ కాల నీ కృష్ణానగర్‌కు వచ్చి వ్యాపారం చేసి, ఇక్క డే సొంతిల్లు కట్టుకుని స్థిరపడ్డారు. వీరికి పిల్ల లు లేరు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడంతో కమలాదేవి(70) ఒంటరిగా ఉంటూ, అద్దె డ బ్బులతో జీవనం కొనసాగిస్తోంది.

ఇటీవల తన ఇంట్లో కిరాయికి ఉంటున్న వ్యక్తిని అద్దె ఇవ్వాలని అడగడంతో ఇద్దరి మధ్యా వాగ్వా దం జరిగింది. దీంతో కమలాదేవిని హత్య చేసినట్టు తెలుస్తున్నది. హత్య చేసిన తర్వాత మృతదేహంపై యువకుడు డాన్స్ చేసిన వీ డియో తన మిత్రులకు పంపాడు. ఆ వీడి యో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మొదట అనుమానాస్పద మృతి గా భావించినప్పటికీ హత్యగా నిర్ధారణకు వ చ్చినట్టు తెలుస్తున్నది.

హత్య అనంతరం మృ తదేహాన్ని ఇంట్లోనే ఉంచి, బయట నుంచి తలుపుకు తాళం వేసి వెళ్లినట్టు సమాచారం. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు లు వచ్చి చూడగా వంట గదిలో అనుమానాస్పద స్థితిలో కమలాదేవి మృతదేహం కని పించింది. ఈ నెల 11న హత్య జరిగినట్టు తె లుస్తోంది. అనుమానితులు ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్న ట్లు సమాచారం. అందులో ఒకరు మైనర్ ఉ న్నట్టు తెలుస్తున్నది.