calender_icon.png 26 December, 2024 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల దాడిలో గాయపడిన వృద్ధురాలు

02-12-2024 11:05:57 PM

నడిగూడెం (విజయక్రాంతి): వీధి కుక్కల దాడిలో వృద్దురాలు గాయాల పాలైన సంఘటన మండలంలోని కరివిరాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన వృద్ధురాలిపై కుక్కలు దాడి చేశాయి. ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయాలపాలైంది. గ్రామంలో కుక్కలు స్తైర్యవిహారం చేస్తు దారిన వెళ్లే వారిపై దాడులు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పిల్లలు పెద్దలు ఒంటరిగా వెళ్లాలంటే భయంతో వనికిపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.