calender_icon.png 16 March, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి..

16-03-2025 06:28:47 PM

పాపన్నపేట: మెట్లపై నుండి జారి పడి చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జాల కిసనమ్మ (66) ఈనెల 12న సాయంత్రం ఆమె ఇంట్లోకి వెళ్తుండగా మెట్లపై నీరు ఉండడంతో కాలు జారి కింద పడింది. దీంతో తల వెనక భాగంలో బలమైన గాయమైంది. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి ఓ ప్రైవేటు ఆస్పత్రికి, మరుసటి రోజు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కొడుకు ఏసులు ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.