పిండిప్రోలు గ్రామంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు
ఖమ్మం, డిసెంబర్ 21 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన వెంకటమ్మ గ్రామంలో కిరాణ షాపు నిర్వహిస్తున్నది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, ఆమె తలపై రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చారు. ఆమె మెడలోని గొలుసును, ఇంట్లో ఉన్న రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఆమె కుమారులు ఖమ్మంలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.