08-03-2025 10:45:04 PM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి...
ఎల్బీనగర్: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వైద్య పరికరాలను శనివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఉచితంగా పేషంట్ అప్ అండ్ డౌన్ బెడ్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, వీల్ చైర్స్, వాకర్స్ పూర్తి ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. పరికరాలను అవసరం ఉన్నన్ని రోజులు వాటిని వాడుకొని, అవసరం తీరిన తర్వాత తిరిగి ఇవ్వాలని సూచించారు.
రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవలు నచ్చితే డొనేషన్ చేయవచ్చని, ప్రజల వద్ద నిరుపయోగంగా ఉన్న హాస్పిటల్ బెడ్స్, వీల్ చైర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇతర పరికరాలను ఫౌండేషన్ ప్రతినిధులకు ఇస్తే వారు నలుగురుకి ఉపయోగపడేలాగా చేస్తారని తెలిపారు. వివరాలకు వనస్థలిపురంలోని డీ మార్ట్ వెనుక ఉన్న రెడీ టూ సర్వ్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హొమ్ ని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఛైర్మన్ పెద్ద శంకర్, బీఆర్ఎస్ నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డి, శివ నేత, బతుకమ్మ ఫేమ్ హీరో విజయ్ భాస్కర్, భాస్కర్ సాగర్, సంపత్, బ్లడ్ డోనర్ నాగమోహన్, శ్రీదేవి, చేపూరి శంకర్, గద్దె విజయనేత, ప్రకాశ్, విక్రమ్, గణేశ్, వినోద్ మామ, చరణ్, నవీన్, లింగ, దత్త, సూర్య, రవితేజ, మహేశ్, శైలజ, విజయలక్ష్మి, వరలక్ష్మి, ఉమా, హసీనా, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.