calender_icon.png 26 December, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడి

03-11-2024 01:45:43 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 2 (విజయక్రాంతి): పదేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో శనివారం వెలు గుచూసింది. డీఎస్పీ బుర్రి శ్రీనివాసు లు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాజిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు తమ కూతురును ఇంటివద్దే ఉంచి కూలి పనికి వెళ్లారు.

ఇంట్లో ఒంటరిగా చిన్నారి ఉన్నట్లు గుర్తించిన అదే గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మల్ల య్య (65) మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యం గా తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయ గా చిన్నారినికి వైద్యపరీక్షలు నిర్వహించి, వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.