calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడికి కఠిన కారాగార శిక్ష

09-04-2025 01:00:26 AM

మేడ్చల్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి): మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 64 ఏళ్ల వృద్ధుడికి  జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి 20 ఏళ్ల కఠిన కారగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. తాను ఉంటున్న ఇంటి ఆవరణలో పక్క గదిలో అద్దెకు నివాసముంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలిక పట్ల బచ్చన్ ప్రసాద్ షా అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్టు నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించారు. బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షలు అందించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉపేందర్, సుశీల వాదనలు వినిపించారు.