calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి హత్య

07-04-2025 12:00:00 AM

ముషీరాబాద్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి):  అనుమానస్పద స్థితిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురైన సం ఘటన శనివారం అర్ధరాత్రి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు  తెలిపిన కథనం ప్రకారం... గాంధీనగ ర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ బోయిగూడలో అల్ఫతా హోటల్ సమీపంలో ఈ ఘటన  జరిగింది.

అల్వాల్ కి చెందిన సత్నం సింగ్ (58) ఈనెల 4వ తేదీన అల్వాల్ నుంచి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవి చౌక్ వరకు తన అన్నతో కలిసి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఇంటికి రాకపోవడంతో అదే రోజు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్  నమోదు చేశారు. 5 వ తేదీన ముషీరాబాద్ పోలీసులకు కేసును బదిలీ చేయగా మిస్సింగ్ కేసు నమో దు చేసి  విచారణ చేపట్టారు.

సత్నం సింగ్ రిపేర్ చేయించుకున్న తన వాహనంపై న్యూ బోయిగూడలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా న్యూ బోయిగూడ అల్ఫాతా హోటల్ సమీపంలోని నవీన్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఇంటికి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు పరిశీలించగా ఇంటికి తాళం వేసి ఉన్నట్లు తెలిపారు. ఇంటి యజమాని రెండు గంటల అనంత రం బయటికి వచ్చి సత్నం  సింగ్ ద్విచ క్ర వాహనంపై వెళ్లిపోయినట్లు పోలీసులు  గుర్తించారు.

వెంటనే ఇంటి తాళాలు పగు లగొట్టి తలుపులు తెరి చి చూడగా సత్నం సింగ్ మృతదేహం సంపులో లభించింది. పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. ముషీరాబాద్ పోలీసులు అలర్ట్ చేసి కేసును చేదించే దిశగా విచారణ ము మ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

నవీన్ చంద్ర నాయక్ అనే వ్యక్తి ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సత్నంసింగ్ వడ్డీ వ్యాపారం చేసే వాడ ని, డబ్బు విషయంలో విభేదాలు వచ్చి ఉండవచ్చని అనుమానం కలిగిందని సమాచారం. ముషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.