12-04-2025 08:48:24 PM
పాపన్నపేట: చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు... గ్రామానికి చెందిన గడ్డం పెంటారెడ్డి(72) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 3న ఇంట్లో మంచంపై నిద్రించాడు. అర్థరాత్రి సమయంలో మంచంపై నుండి కింద పడడంతో తలకి గాయమైంది. కుటుంబీకులు గమనించి స్థానికంగా వైద్యం చేయించారు. ఈ నెల 11న చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుండి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.