29-03-2025 08:42:12 PM
రామాయంపేట (విజయక్రాంతి): రామయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవాలయాన్ని శుభ్రం చేస్తుండగా పక్కన స్తంభానికి ఉన్న సపోర్ట్ వైర్ తగిలి గ్రామానికి చెందిన కిచ్చయ్య, మాధవరెడ్డి (73) మృతి చెందడం మాధవరెడ్డితో పాటు అతని భార్య భారతమ్మ ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు. సుమారు 15 సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు హనుమాన్ దేవాలయానికి సేవ చేస్తూ జీవనం గడుపుతుంటారని గ్రామస్తులు తెలిపారు. మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.