చేగుంట, ఫిబ్రవరి 10: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని కర్నాలపల్లి గ్రామంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆదివారం చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్.ఐ శ్రీచైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కర్నాలపల్లి గ్రామానికి చెందిన కొప్పుల బాలయ్య( 79) గత కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడని, నొప్పిని భరించలేక చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.