నాగర్కర్నూల్,(విజయక్రాంతి): కెఎల్ఐ కాల్వలో పడి వృద్దుడు గల్లంతయ్యాడు. ఈఘటన నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుడిపల్లి గ్రామానికి చెందిన పోసాని బంగారయ్య(65) తన స్వంత మేకలకు కాపరిగా పనిచేస్తుండేవాడు. కుటుంబ సమస్యల కారణంగా శుక్రవారం ప్రదాన రహదారి పక్కనే ఉన్న కెఎల్ఐ కాల్వలోదూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఫైర్ స్బిందికి సమాచారం ఇవ్వగా వారు సాయంత్రం వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. మృతుడికి నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.