11-02-2025 11:42:54 PM
ఏపీకి చెందిన వంట మాస్టర్లుగా గుర్తింపు..
ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో మంగళవారం వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంటి తలుపులు బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణానికి చెందిన నరసింహారావు, కోటమ్మలుగా వీరిని గుర్తించారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో వృద్ధ దంపతులు ఇద్దరూ వంట మాస్టర్లుగా పని చేస్తున్నారు. అయితే బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఘటన గురించి ఆరా తీశారు.