14-02-2025 12:00:00 AM
జగిత్యాల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సూచించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ అశోక్’కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మార్చి 10 నుండి 12 రోజుల పాటూ నిర్వహించే బ్రహ్మోత్సవాలను ప్ర శాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుం డి ధర్మపురికి వచ్చే భక్తులకు అవసరమైనన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని రవా ణా శాఖ అధికారులకు సూచించారు. ఎండ వేడి ఎక్కువగా ఉండే అవకాశాలున్నందన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిల్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయా లన్నారు.
బ్రహ్మోత్సవాల్లో అధికారులు తమ పరిధిలోని విధుల్లో అలసత్వం వహిం చి, భక్తులకు ఇబ్బందులు కలగజేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్ర సాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ అశోక్’కుమార్ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లను నిర్వ హించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుం టున్నామన్నారు.
బ్రహ్మోత్సవాలలో ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన బందోబస్తు ఉండాలన్నారు. భక్తులకు 12 రోజుల పాటూ ఉచిత అన్న ప్రసాద వితరణకు సంబంధిం చిన ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన ఈవో శ్రీనివాస్ వివరించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఏస్పీ రఘుచందర్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మా ర్వో, ఎంపీడీవో, సంబంధిత అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.