ముంబయి,(విజయక్రాంతి): ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మంగళవారం రాజీనామా చేశారు. మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీకాలం ఇవాళ్టితో ముగియనుండంతో షిండే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీన్, అజిత్ పవార్ లతో కలిపి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. మరోవైపు సీఎంపై స్పష్టత వచ్చే వరకు ఏక్ నాథ్ షిండే ఆపధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు.
మహారాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 234 స్థానాలతో ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) 48 సీట్లు రాగా, బీజేపీ నుంచి మఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని పార్టీ అధిష్ఠానం అంటుంటే, ఏక్ నాథ్ షిండేనే కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది. దీంతో ముఖ్యమత్రి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే దానిపై స్పష్టత రాలేదు.