calender_icon.png 24 January, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహన లోపంతోనే ఏకశిలా నగర్ ఘటన

23-01-2025 08:53:49 PM

ఈటలను తప్పుదోవ పట్టించిన రియల్ బ్రోకర్లు...

పూర్తి వివరాలను ఎంపీ ఈటలకు అందజేస్తాం...

తమ భూమికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి...

శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్, ఆలూరి విజయ్ భాస్కర్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండల్ కొర్రెముల గ్రామం ఏకశిలనగర్ లో జరిగిన దాడి పూర్తిగా అవగాహన లోపంతోనే జరిగిందని శ్రీహర్ష కన్స్ ట్రక్షన్స్ ప్రతినిధులు ఆలూరి వెంకటేష్, ఆలూరి విజయ్ భాస్కర్ లు తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు చెరుకు నర్సింహా గౌడ్, ఎన్.వెంకటనారాయణ, బి.సురేందర్ రెడ్డిలతో కలసి వారు మాట్లాడుతూ... కొర్రెముల గ్రామం సర్వే నెం.739 నుండి 742 వరకు 47-25 గుంటల భూమిని 2007లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ రెండు వేల ప్లాట్లు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఎంపీ ఈటలను స్థానిక రియల్ బ్రోకర్లు తప్పుదోవ పట్టించారని అన్నారు. తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక పేద మధ్య తరగతి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకువచ్చారని అన్నారు. తప్పుడు సమాచారంతో స్థానిక ప్రజాప్రతినిధిని అక్కడికి ఆహ్వానించడంతో ఆయనను చూసుకొని రియల్ బ్రోకర్లు చెలరేగి పోయారని పేర్కొన్నారు. సీబీసీఐడీ, ఏసీబీతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. తమను రౌడీలు, గుండాలుగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని భూమికి రక్షణ కల్పించడంతో పాటు తమపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.