రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 26 (విజయక్రాంతి) : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం అర్చకులు రాజన్నకు మహాన్యాస పూరక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రావణమాస ం చివరి సోమవారం కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుండే ధర్మగుండంలో పుణ్యసాన్నమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నా రు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ అధికం గా ఉండడంతో ఆర్జిత సేవలు రద్దు చేశారు. కేవలం లఘు దరనానికి మాత్రమే అనుమతించారు. సాయంత్రం భీమేశర ఆలయం లో మహాలింగార్చన చేశారు.