calender_icon.png 28 January, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

82 కిలోల గంజాయి పట్టివేత

25-01-2025 12:51:40 AM

భద్రాచలం, జనవరి 24: ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు శుక్రవారం భద్రాచలం కూనవరం రోడ్డులోని ఆర్టీవో చెక్‌పోస్టు వద్ద పట్టుకొన్నారు. ఒడిశా మల్కాన్‌గిరి జిల్లా నుంచి కేరళకు గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎన్‌ఫో ర్స్‌మెంట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో కారు లో తరలిస్తున్న 82 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి, కారుతో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.