calender_icon.png 12 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డమాస్కస్ అష్ట దిగ్బంధనం

08-12-2024 12:50:09 AM

  1. * రాజధాని స్వాధీనం దిశగా రెబెల్స్
  2. సిరియాలో అసద్‌కు ఎదురుదెబ్బ
  3. *రెబెల్స్ చేతికి దారా, హామ్స్ నగరాలు

న్యూఢిల్లీ/డమాస్కస్, డిసెంబర్ 7:  సిరియా అధ్యక్షుడు బషర్ అల్ ఎదురుదెబ్బ తగిలింది. టర్కీ మద్దతు గల ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ  హయత్ తహరీర్ అల్‌న తిరుగు బాటు దారులు రాజధాని డమాస్కస్‌ను అష్టదిగ్బంధనం చేశారు. కేవలం 12 మైళ్ల దూరంలోనే రెబెల్స్ తిష్ట వేశారు. డమాస్కస్‌ను ఏ క్షణమైనా స్వాధీనం చేసుకుని అసద్‌ను గద్దె దించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జవ్‌లానీ ప్రకటించారు.

తిరుగుబాటుదారులు రాజధానిని ఆక్రమించినట్లు వార్తలు రావడంతో అధ్యక్షుడు బషర్ దేశం నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధ్యక్షుడు ఎక్కడికి పారిపోలేదని, దేశంలోని తన నివాసంలోనే ఉన్నారని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. దేశంలోని నాలుగో అతిపెద్ద నగరమైన దారా పట్టణాన్ని హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

అలాగే అతిపెద్ద మూడో నగరమైన హామ్స్ నగరంలోకి ప్రవేశించారు. దీంతో నైరుతి సిరియా ప్రాంతమంతా రెబెల్స్ చేతిలోకి వెళ్లిపోయింది. దేశంలోని మిలిటరీ ప్రధాన కేంద్రాలను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకుంటుండడంతో ఈజిప్టు, జోర్డాన్, ఇరాక్, యూఏఈ దేశాల సహాయాన్ని అధ్యక్షుడు అభ్యర్థించారు. అయితే దేశం విడిచి వెళ్లాలని కొంతమంది అధికారులు అసద్‌ను కోరినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. 

నవంబర్ 27న హెచ్‌టీఎస్ తిరుగుబాటుదారులు రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో ను ఆక్రమించారు. ఆ తరువాత హమా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే జో ర్డాన్‌కు దగ్గరలో ఉన్న దారా నగరం రెబెల్స్ చేతికి చిక్కడంతో అక్కడినుంచి ప్రభుత్వ దళా లు పారిపోయాయి. చెక్‌పోస్ట్‌లను రెబెల్స్ నియంత్రణలోకి తీసుకున్నారు. డ్రూజ్ తిరుగుబాటుదారులు దక్షిణ ప్రాంతంలో రెచ్చి పోతుండడంతో సిరియాతో తన బార్డర్‌ను జోర్డాన్ మూసివే సింది. ఇదే సమయంలో తూర్పు సిరియాలో ఉన్న ఇరాక్ సరిహద్దులోని దేర్ ఎల్ జోర్ నగరాన్ని అమెరికా మద్దతు ఉన్న కుర్దుష్ దళాలు తమ నియంత్రణలోకి తీసుకున్నాయి. 

దేశమంతటా ప్రభుత్వ దళాలు చేతులు ఎత్తేస్తుండడంతో అంతర్యుద్ధం తీవ్రతరమవుతోంది. అసద్‌కు వ్యతిరేకంగా 2011 నుంచి తిరుగుబాటు జరుగుతోంది. కాగా సిరియాలో అంతర్యుద్ధం తీవ్రం కావడంతో తమ జాతీయులు వెంటనే సిరియాను విడిచిపెట్టాలని రష్యా, జోర్డాన్, భారత్ ఆదేశాలు జారీ చేశాయి. భారతీయులు 

సిరియాను వీడండి..

 సిరియాలో అంతర్యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ అక్కడున్న భారత పౌరులకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ హెచ్చరికలు జారీ చేశారు. తక్షణమే సిరియాను వీడాలని అర్ధరాత్రి తరువాత అడ్వైజరీ బోర్డును విదేశాంగ శాఖ విడుదల  చేసింది. సిరియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా భారతీయు లెవరూ తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు సిరియాకు వెళ్లొద్దని సూచించింది.

ఇప్పటికే  అక్కడున్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా దేశాన్ని వీడాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో డమా స్కస్‌లోని ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. అత్యవసర సహాయం కోసం +96399 3385973, hoc.damascus @mea.gov.inను సంప్రదించాలని సూచించింది. అలాగే సిరియా లో ప్రయాణించేటప్పుడు అత్యంత  అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ ఓ  ప్రకటనలో తెలిపింది.