calender_icon.png 3 April, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనిమిదివ తరగతి బాలిక అదృశ్యం

02-04-2025 10:27:12 PM

కేసు నమోదు..

పాపన్నపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నుండి ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... పాపన్నపేట కస్తూర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని (16) ఉదయం విద్యార్థులతో కలిసి ఉదయం హాజరులో పాల్గొంది. ప్రార్థన అనంతరం హాజరు తీసుకొనే సమయంలో విద్యార్థిని కనిపించలేదు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల మొత్తం విద్యార్థిని కోసం వెతికారు. విద్యార్థిని కనిపించకపోవడంతో ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కస్తూర్బా పాఠశాల ఎస్ఓ బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.