12-03-2025 01:45:40 AM
శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవం ఉత్సవ పరిసమాప్తి
యాదాద్రి భువనగిరి మార్చి 11 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్స వాలలో భాగంగా 11వ రోజు మంగళవారం నాడు స్వామివారికి శత ఘటాభిషేకాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించారు. స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం అర్చకులు, ప్రధానార్చకులు, పండితులు, పారాయనీకులు స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అష్టోత్తర శతఘటాభిషేకం ప్రత్యేకత...
బ్రహ్మోత్సవాలను నిర్వహించబడే అష్టోత్తర శత ఘటాభిషేకం అనేక విషయాలకు నిలయమై ఉన్నది. ఘటము అనగా జీవుడు అని, అందులో ఉండు జలము, ప్రకృతి సంబంధమైన వాసనలని వాటిని సభక్తికముగా, మంత్ర పూర్వకముగా, భగవద్పనాగా వించినప్పుడు. ప్రతి జీవి ధన్యజీవి కాగలడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి.కలశములలో ఉంచబడిన జలములు.
మంత్రాన్వితములై పంచామృత భరితములై పాల పుష్ప రసాధులతో మిళితమై సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పటణములతో, మంగళ వాయిద్యాల మధ్య మూల వరులకు ఈ అభిషేక మహోత్సవము నిర్వహించెదరు. ఈ వేడుక విశ్వశాంతి లోక కళ్యాణ కారకమని ఆగమములు సూచించబడుతున్నాయని పండితులు పేర్కొన్నారు.
శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవం...
రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారికి శృంగార డోలోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు,పారాయనీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. డోలుమోనగా ఊయల అని అర్థం శ్రీ స్వామివారికి అమ్మవారికి వివిధ నామ సంకీర్తనలతో శృంగార డోలోత్సవ వేడుక నిర్వహించుట ఎంతో విశేషమైనది. మంచస్తం మధు సూధనం అని శృతి వాక్యం.
డోలారోహులైన స్వామి వారిని అమ్మవారిని దర్శించిన భగవద్ అనుగ్రహం చే మనోరధములు నెరవేరునని పురాణాలలో తెలియజేయబడుతున్నవి అని అని అర్చకులు వివరించారు. శృంగార సంగర కిరీట లసద్వారాంగా అని ఆదిశంకరుడు శ్రీ స్వామిని స్తుతించుట ఈ శృంగార డోలోత్సవాలలో అంతరార్థమని వివరించారు. స్వామి వారికి డోలోత్సవం జరిపిన అనంతరం పండితులకు సన్మానం సన్మానం చేసి ఉత్సవ పరిసమాప్తి గావించారు.