calender_icon.png 30 April, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింహాచలం ఆలయంలో అపశ్రుతి.. గోడ కూలి ఏడుగురు మృతి

30-04-2025 08:05:56 AM

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విశాఖ పట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న(Simhachalam Temple) చందనోత్సవంలో బుధవారం అపశ్రుతి చోటుచేసుకుంది. తెల్లవారుజామున భక్తులపై గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు.  మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.

సింహాచలంలో భారీగా కురిసిన వర్షానికి గోడ భక్తులపై కూలింది. రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద భక్తులపై గోడ కూలిందని అధికారులు తెలిపారు. భక్తుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది మృతదేహాలను స్వాధీనం చేసుకుని విశాఖ కేజీహెచ్(Visakhapatnam KGH)కు తరలించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయచర్యలు చేపట్టారు. మృతుల్లో పత్తి దుర్గాస్వామినాయుడు, ఎడ్ల ఎంకట్రావు, కమ్మపట్ల మణికంఠ, ఈశ్వరరావు ఉన్నారు. గాయపడిన వార ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.