వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై జరిగిన దాడిలో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేసారు. ఈ కేసులో మరో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. లగచర్ల గ్రామస్థులను అదుపులోకి తీసుకోని పరిగి పీఎస్ కు తరలించారు. ఎనిమిది మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దాడి కేసులో ఆరోపణలతో ఎదుర్కొన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. కాగా, 16 మంది నిందితులను పరిగి జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలించారు. అదనపు డీజీ మహేష్ భగవత్ లగచర్ల ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. లగచర్లతో పాటు పరిసర గ్రామాల్లో పరిస్థితిపై అదనపు డీజీ ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందలతో గాలిస్తున్నామని అదనపు డీజీ తెలిపారు.