13-04-2025 01:41:42 AM
చర్ల, ఏప్రిల్ 12: భద్రాద్రి జిల్లా చర్ల సరిహద్దులోని ఛతీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దంతెవాడలో శనివారం ఎనిమిది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసు బలగాలు నిర్వహిస్తున్న లోన్ వర్రటు (తిరిగి ఇంటికి రండి) అనే ప్రచారంతో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో టేకల్‌గూడ పంచాయతీ సీఎన్‌ఎం సభ్యుడు మంగాడు మడ్కం, రేవాలి పంచాయతీ సీఎన్‌ఎం సభ్యుడు దేవారామ్ కుంజ మ్, కాకడి పంచాయతీ సీఎన్‌ఎం సభ్యుడు హద్మా సోడి, టీమెనార్ జీఆర్‌డి సభ్యుడు బుద్రామ్ మడ్కం, బైరామ్‌గడ్ ఏరియా స్టుడెంట్ ఆర్గనైజేషన్ సభ్యుడు జోగ మడ్కం, కాకడి పంచాయతీ డీకే ఎంఎన్ సభ్యుడు పయ్కి కోవాసి, మున్నా కోవాసి, సిగరేట్ వనజామి, పాయ్కు వంజమి ఉన్నారు.
నారాయణపూర్ అడవుల్లో డంపు స్వాధీనం
ఛతీస్‌గఢ్ రాష్ట్రంలో పోలీసులు, భద్రతా బలగాలు చేపడుతున్న పె ట్రోలింగ్‌లో భాగంగా శనివారం నారాయణపూర్ సమీపంలోని అ బుజ్మద్ అద్నార్, బట్టేకల అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన డంపు ను పోలీసులు సీజ్ చేశారు.